Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం కోసం నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మూడు సంఘాలుగా ఉన్న లోదా సామాజిక వర్గం 'లోద్ క్షత్రియ సర్దార్ పంచాయత్' పేరుతో ఏక సంఘంగా ఏర్పడింది. హైదరాబాద్‌లోని తన నివాసంలో రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ బుధవారం లోధా ఏక సంఘ ప్రతినిధులైన ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ పరమేశ్వరిలకు లోధా/లోది ఆత్మగౌరవ భవనానికి సంబంధించిన అనుమతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ సంఘాలు ఏకతాటిపైకి వస్తున్నాయని తెలిపారు. 27 కుల సంఘాలు ఏక సంఘంగా ఏర్పడి వేల కోట్ల విలువైన కోకాపేట్, ఉప్పల్ భగాయత్ భూముల్లో ఆత్మగౌరవభవనాలను నిర్మించుకుంటున్నాయని అన్నారు. ప్రభుత్వ కషితో లోది సామాజిక వర్గంలోని అన్ని సంఘాలు ఏకతాటి పైకి వచ్చాయని, ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ పరమేశ్వరి ఇతర లోది సామాజిక వర్గ నేతలంతా ఏకసంఘంగా ముందుకొచ్చి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. 41 కుల సంఘాలకు కోకాపేట్, ఉప్పల్ భగాయత్‌లోని 87.3ఎకరాలు, రూ.95.25 కోట్లు కేటాయించి నిర్మాణాలు సైతం జరుపుకునేలా వెసులుబాటును కల్పించామని అన్నారు. ఉప్పల్ బాగాయత్లో లోదా/లోది సామాజిక వర్గ ఆత్మగౌరవ భవనానికి 20 గుంటలతో పాటు రూ.50లక్షలు కేటాయించామని వివరించారు. లోధా సంఘం ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రాజాసింగ్ లోదా సామాజిక వర్గానికి ఆత్మగౌరవ భవనం కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి గంగుల కమలాకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలోనే భవన నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేస్తామని ఆయన వివరించారు. చెక్కులు అందజేత
వఢ్డెర ఫెడరేషన్ నుంచి మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓర్సు కొమురయ్యకు పై చదువుల నిమిత్తం రూ.75వేల చెక్కును బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం అందజేశారు. ఆయనతోపాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన దేరంగుల మల్లయ్య రాళ్లపనులు చేసేవారు. ప్రమాదవశాత్తు కాలుపై రాయిపడి కాలు విరిగింది. ఈ సమస్యను ఉన్నతాధికారుల దష్టికి తీసుకుపోగా దేరంగుల మల్లయ్యకు రూ.50 వేల చెక్కును హైదరాబాద్‌లోని బీఆర్కేభవన్లో అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, వడ్డెర ఫెడరేషన్ ఎండీ మల్లయ్య భ0ట్టు, వెంకన్నకు చేతివత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు పైళ్ల ఆశయ్య, వడ్డెర వత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లపు విగేష్, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ దేరంగుల లక్ష్మీపతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.