Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టుల పంజా..11 మంది పోలీసులు మృతి
- జవాన్లను ఆదుకుంటాం :ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడలో మళ్లీ ధనాధన్ అంటూ కాల్పులతో దద్దరిల్లింది. అరుణాపూర్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు పంజా విసిరారు. మావోయిస్టులు మాటు వేసి మండేదా అడవుల్లో మందు పాతర పేల్చడంతో పదిమంది డిఆర్జీ జవాన్లు, ఒక డ్రైవర్ మృతిచెందారు. బస్తర్ ఐజీ సుందర్‌లాల్.పి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం కూబింగ్కి వెళ్లిన జవాన్లు బుధవారం ప్రయివేట్ మినీ బస్సు ఆపి.అందులో ప్రయాణిస్తుండగా మావోయిస్టులు గురిపెట్టి సుమారు 50 కేజీల ఐఈడీని పేల్చారు. దాంతో జవాన్ల వాహనం తునాతునకలైంది. డ్రైవర్‌తోపాటు మొత్తం 10 మంది జవాన్లు మృతిచెందారు. పేలిన ప్రదేశంలో పది అడుగుల లోతు గుంట ఏర్పడింది. మృతులు హెడ్ కానిస్టేబుళ్లు జోగా మున్నా రామ్ కడ్తి, సంతోష్ తమో, దుల్గో మాండవి, లక్ష్ము మార్కం, జోగా కవాసి, హరిరామ్ మాండవి, జవాన్లు రాజు రామ్ కర్తమ్, జైరాం పొడియం, జగదీష్ కవాసి, డ్రైవర్ నిరామ్ యాదవ్ వీరమరణం పొందారని ఐజీ ధ్రువీకరించారు. విధి నిర్వహణలో ఉన్న జవాన్లను మట్టు బెట్టిన మావోయిస్టులను వదిలేది లేదు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని ఛత్తీస్‌గఢ్ సీఎం హామీ ఇచ్చారు.
హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు
మావోయిస్టుల దాడి తర్వాత పోలీసులు వెంటనే ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొనడానికి అదనపు పోలీసులు సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుని గాలిస్తున్నారు. రాష్ట్రంలో మావోయిస్టు చర్యలను నిర్వీర్యం చేసేందుకు 2008లో డీఆర్జీని ఏర్పాటు చేశారు. ఈ దళాన్ని మొదట కంకేర్ , నారాయణపూర్‌లో మోహరించా రు.అనంతరం 2013 లో బీజాపూర్ , బస్తర్, ఆపై 2014 లో సుక్మా, కొండగావ్, ఆ తర్వాత 2015 లో దంతెవాడలో బలగాలను ఏర్పాటు చేశారు.