Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం
నవతెలంగాణ- విలేకరులు
తమ సమస్యలు పరిష్కరించాలని, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని.. వేతనాలు పెంచాలని కోరుతూ ఐకేపీ వీఓఏలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. గురువారం రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కందుకూర్, తలకొండపల్లి, కడ్తాల్, మహేశ్వరంలో వీఓఏల దీక్షలకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. కందుకూర్, కడ్తాల్, తలకొండపల్లిలో మోకాళ్లపై కూర్చుని వీఓఏలు నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి ఆధ్వర్యంలో వీఓఏలు మంత్రి సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. వీఓఏల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని వనపర్తి జిల్లా పరిధిలోని కొత్తకొట మండల కేంద్రంలో ఐకేపీ వీఓఏలు నిరవధిక దీక్ష చేపట్టారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ సంఘీభావం తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి, వంగూరు మండలాల్లో ఐకేపీ-వీవోఓలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. మేనేజర్ పవన్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్లు లక్ష్మీ, నరేష్, సీఐటీయూ జిల్లా నాయకులు ఏం.విజరుగౌడ్ వివోఏలకు మద్దతు తెలిపారు.
నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో ఐకేపీ వీఓఏలు ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. కేతెపల్లిలో కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ వీఓఏల సమ్మెకు మద్దతు తెలిపారు. మిర్యాలగూడలో తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అదనపు కలెక్టర్ ఖుష్భుగుప్తాకు వివోఏలు వినతిపత్రం అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో వీవోఏల దీక్షలకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య సంఘీభావం తెలిపారు. వీవోఏల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. వారికి తాము అండగా ఉంటామని చెప్పారు. ములకలపల్లిలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టేకులపల్లి సీఐటీయూ జిల్లా కోశాధికారి మేకల పద్మ,పినపాకలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపారు.