Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ సత్యాగ్రహ దీక్షలో మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశ సంపదను పెట్టుబడిదారుల కు మోడీ దోచిపెడుతున్నారని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ విమర్శించారు. ముఖ్యంగా తన స్నేహి తులైన అదానీ, అంబానీలకు అప్పనం గా కట్టబెడుతున్నారని చెప్పారు. ప్రజా ఆస్తులను కార్పొరేట్లకు దోచి పెడుతు ంటే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ పార్లమెంట్లో మోడీని ప్రశ్నించారని గుర్తు చేశారు. దీంతో ఆయనపై మోడీ కక్ష కట్టారని విమర్శించారు.
ఏఐసీసీ పిలుపుమేరకు గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్ ఆవరణలో పంచాయతీరాజ్ సంఘటన్ నిర్వహించిన భారత్ సత్యా గ్రహ దీక్షలో ఆమె మాట్లాడారు. రోజు రోజుకు ఆవిరౌతున్న దేశ సంపద రక్షణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసి విచారణ చేపట్టా లని డిమాండ్ చేశారని తెలిపారు. ఈవిషయంలో పార్ల మెంట్లో చర్చకు కూడా సిద్ధంగా లేని మోడీ రాహుల్‌ను పార్లమెంట్ నుంచి బయటకు పంపేం దుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఎంపీ పదవిని రద్దు చేయించి, చివర కు ఇంటిని కూడా ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకున్ని ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు.
బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది : ఉత్తమ్
బీజేపీ అప్రజాస్వామికంగా రాహు ల్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడు తున్నదని ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అందుకు ప్రజా స్వామ్య పద్ధతిలో పార్టీ పోరాడుతుం దని చెప్పారు. పోర్టులు, విమానాశ్ర యాలు, పోర్టులు, విద్యుత్ లైన్లు, ప్రభుత్వరంగ సంస్థలను అదానీకి మోడీ కట్టబెడుతున్నారని విమర్శించా రు. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవ హరిస్తున్న మోడీ తీరుపై రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రస్తావించారనీ, దాన్ని మోడీ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. నీరవ్ మోడీ రూ. 14 వేల కోట్లు దోచుకున్నారనీ, లలిత్ మోడీ క్రికెట్ సంఘాన్ని మోసం చేసి లండన్పారిపోయారని ఆరోపించారు.
బీజేపీ రాజకీయ కక్ష పరాకాష్టకు చేరింది : చిన్నారెడ్డి.
రాహుల్ గాంధీపై బీజేపీ సర్కా రు రాజకీయ కక్ష పరాకాష్టకు చేరింద ని ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి వి మర్శించారు. రాహుల్ గాంధీపై సూర త్ కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆ కాపీ రాకముందే ఆయన పార్లమెంట్ సభ్య త్వాన్ని రద్దు చేశారని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీకి వస్తు న్న మద్దతు చూసి బీజేపీ భయ పడు తోందని చెప్పారు. భవిష్యత్తులో ఆయ న్ను దేశ బహిష్కరణ చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. ఇలా ంటి సమయంలో దేశమంతా ఆయన కు మద్దతుగా నిలబడాల్సిన అవసర ముందని చెప్పారు.
దేశంలో ప్రజాస్వామ్యం హత్య : నదీమ్ జావీద్
రాహుల్ గాంధీ విషయంలో మోడీ, అమిత్‌షా చేస్తున్న రాజకీయ కుట్రల విషయంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శాంతి యుత పోరాటం చేస్తు న్నదని ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావీద్ చెప్పారు. దేశంలో జరుగుతు న్న ప్రజాస్వామ్య హత్యపై ప్రజలు కాం గ్రెస్‌కు అండగా ఉండాలని పిలుపుని చ్చారు. ప్రజలు శాంతి, న్యాయం వైపు ఉండాలని కోరారు.
రాహుల్ గాంధీకి సంపూర్ణ మద్దతిస్తూ పోస్ట్ కార్డ్ చేయా లని కోరారు. దీక్షలో టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ హను మంతరావు, నాయకులు గడ్డం ప్రసాద్ కుమార్, కోదండరెడ్డి, రోహిన్ రెడ్డి, నూతి శ్రీకాంత్, సంగిశెట్టి జగదీష్, సునీతా రావు, శ్రీనివాస్, సంఘటన్ రాష్ట్ర అధ్యక్షులు సిద్దేశ్వర్ తదితరులు మాట్లాడారు.