Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు ఏఐఎస్ఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గురుకుల డిగ్రీ లెక్చరర్ (డీఎల్) పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లో నూతనంగా సెట్, నెట్ అర్హత సాధించిన వారికి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని గురువారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, సహాయ కార్యదర్శి గ్యార నరేష్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు చైతన్య యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శివ నాయకులు కళ్యాణ్, వీరస్వామి కలిసి వినతిపత్రం సమర్పించారు. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులు సెట్, నెట్ పరీక్షలు రాసి ఉన్నారని తెలిపారు. వాటి ఫలితాలు రావడంలో ఆలస్యమైందని పేర్కొన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. గురుకుల అధికారులకు ఫోన్ చేసి నూతనంగా అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని, నిరుద్యోగులెవరూ నష్టపోవద్దని మంత్రి సూచించారని పేర్కొన్నారు.