Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వేసవి శిక్షణా శిబిరం మే ఒకటి నుంచి జూన్ నాలుగు వరకు నిర్వహిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 16 సంవత్సరాలలోపు చిన్నారులకు సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ (ఆర్ఎస్సీ ) గ్రౌండ్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిబిరంలో ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, చెస్, క్రికెట్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, కబడ్డీ విభాగాల్లో పిల్లలకు, 20 ఏండ్లు పైబడిన వారికి ప్రాథమిక ఫిట్నెస్ శిక్షణ / యోగా శిక్షణ ఉంటుంది . ఆసక్తి కలిగిన వారు స్పోర్ట్స్ ఆఫీస్, రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ నుంచి దరఖాస్తు ఫారమ్‌లను పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9866147148, 040-27785334 నెంబర్లలో సంప్రదించవచ్చు.