Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో గురువారం గంటన్నరపాటు వాదప్రతివాదనలు జరిగాయి. ఆయన తరఫున సీనియర్ లాయర్ నిరంజన్‌రెడ్డి, సునీత తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ లూత్రా, సీబీఐ తరపున పీపీ నాగేంద్ర వాదనలు వినిపించారు. వివేకాను దస్తగిరే హత్య చేశాడు. అలాంటప్పుడు దస్తగిరి స్టేట్మెంట్ను ఎలా పరిగణలోకి తీసుకుంటారు.. అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. గూగుల్ టేకౌట్ ఎలా ఆధారం అవుతుందని కూడా ప్రశ్నించారు. అవినాష్‌ను లక్ష్యంగా చేసుకొనే సీబీఐ దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. సీబీఐ దర్యాప్తునకు అవినాష్ సహకరిస్తున్నారనీ, కాబట్టి అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. పిటిషనర్‌పై క్రిమినల్ కేసులు లేవని చెప్పగా సునీత లాయర్ కల్పించుకుని ఎన్నికల అఫిడవిట్లో క్రిమినల్ కేసులు ఉన్నాయని అవినాష్ స్వయంగా చెప్పారని అన్నారు. విచారణకు అవినాష్ సహకరించడం లేదని సీబీఐ లాయర్ చెప్పారు. విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ జస్టిస్ సురేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.
గంగిరెడ్డి బెయిల్ రద్దు
వివేకా హత్య కేసులో తొలి నిందితుడైన గంగిరెడ్డికి పులివెందుల కోర్టు గతంలో ఇచ్చిన బెయిల్‌ను గురువారం తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నందున గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సుమలత తుది ఉత్తర్వులు జారీ చేశారు. మే 5వ తేదీలోగా సీబీఐ ఎదుట లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించారు. లేనిపక్షంలో గంగిరెడ్డిని సీఐబీ అరెస్టు చేయవచ్చునని తెలిపారు.
పీఎస్‌లో వ్యక్తి మృతిపై విచారణ
తుకారాంగేట్ పీఎస్‌లో ఈ నెల 25న చిరంజీవి అనే 32 ఏండ్ల ఆటో డ్త్రెవర్ను పోలీసుల విచారణకు తీసుకొచ్చిన తర్వాత మరణించిన ఘటన గురించి ఇంగ్లిషు పత్రికలో వచ్చిన వార్తను హైకోర్టు పిటిషన్‌గా పరిగణించింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్, నార్త్ జోన్ డీసీపీ, గోపాలపురం ఏసీపీ, తుకారాంగేట్ ఎస్హెచ్ఓలను ప్రతివాదులుగా చేసింది. సెల్ఫోన్ల దొంగతనం కేసులో చిరంజీవిని ఎల్బీనగర్ ఏరియా నుంచి తుకారాంగేట్ పోలీసులు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. ఫిట్స్ వచ్చాయని చిరంజీవిని గాందీ ఆస్పత్రిóకి తీసుకువెళ్లారు. అక్కడ చనిపోవడంతో బంధువులు ధర్నా చేశారు. పోలీసుల దెబ్బల వల్లే చనిపోయాడని ఆరోపణలపై విచారణ జరిపారు.