Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమం (తొలిమెట్టు) వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 2022-23 విద్యాసంవత్సరంలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులందరికీ ప్రణాళికాబద్ధంగా బోధనాభ్యసన కార్యక్రమాలను అమలు చేయాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పూర్తిగా పడిపోయిన విషయం తెలిసిందే. ఆ సామర్థ్యాన్ని పెంచడం కోసమే ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించింది.