Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై గవర్నర్‌కు వైఎస్ షర్మిల లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ స్కాములోఐటీ విభాగం పాత్రపై సిట్ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో నివేదిక కోరాలంటూ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్‌కు వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల గురువారం బహిరంగ లేఖ రాశారు. పేపర్ లీకేజీతో ఏండ్ల తరబడి కష్టపడి ప్రిపేరయిన పరీక్షకు హాజరైన అభ్యర్థుల ఆశల మీద నీళ్లు చల్లినట్టయిందని తెలిపారు. ఐటీ శాఖ వైఫల్యం వల్లనే లీకేజి జరిగిందని పేర్కొన్నారు. ఆ శాఖ జోలికి సిట్ వెళ్లటం లేదని తెలిపారు. ఈ వ్యవహారంలో పెద్దొళ్ల ప్రమేయమే ఉందని తెలిపారు. అందుకే పోలీసులు ఆ దిశగా విచారణ చేయటం లేదని పేర్కొన్నారు.