Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజల ఎజెండాతోనే బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చెప్పారు. ప్రధాని మోడీకి మూడిందనీ, వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. గురువారం తెలంగాణాభవన్ లో జరిగిన బీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా తనను కలిసి విలేకర్లతో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా పోయిందని ఎద్దేవాచేశారు. రాజకీయాల్లో ఎత్తుగడలు వేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని చెప్పారు. ఏ రాష్ట్రంలో ఏ సమయంలో ఏ ఎత్తుగడ వేయాల్లో కేసీఆర్‌కు తెలిసినంతగా మరొకరికి తెలియదని స్పష్టం చేశారు. సమయానుకూలంగా ఎత్తుగడలు ఉంటాయని తేల్చి చెప్పారు. అటువంటి ఎత్తుగడలతో తెలంగాణా రాష్ట్ర సాధించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సరికొత్త ఎత్తుగడలతోనే దేశ రాజకీయాల్లోకి తెలిపారు.