Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ కళాభవన్ లీజ్ రద్దు.. సీజ్
నవతెలంగాణ-ముషీరాబాద్, సిటీబ్యూరో
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్ధ సుచిరిండియాకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) గురువారం సీజ్ చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్‌తో గతంలో చేసుకున్న అద్దె కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసింది. సుచిరిండియా సంస్థ 2016లో టీఎస్ఆర్టీసీకి చెందిన ఆర్టీసీ కళాభవన్‌ను అద్దెకు తీసుకుంది. ఆ భవన్లో కల్యాణమండపం, కళాభవన్, మరో మూడు మినీ హాళ్లు లీజ్‌కు తీసుకుంటూ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం నెలకు రూ.25.16 లక్షలను టీఎస్ఆర్టీసీకి సుచిరిండియా చెల్లించాలి. అయితే, కొంతకాలంగా సుచిరిండియా సంస్థ అద్దె సకాలంలో చెల్లించకపోవడంతో 6.55 కోట్ల రూపాయల బకాయి పేరుకుపోయింది. అద్దె బకాయి చెల్లించాలని టీఎస్ఆర్టీసీ అధికారులు పలుమార్లు సుచిరిండియాకు నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థ నుంచిగానీ, యాజమాన్యం నుంచిగానీ తగిన స్పందన రాలేదని టీఎస్ఆర్టీసి స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం నెల నెలా అద్దె చెల్లించకుంటే నోటీసులు జారీ చేసి, ఆర్టీసీ కళాభవన్‌ను టీఎస్ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకునే వెసులుబాటు ఉంది. నోటీసులకు సుచిరిండియా సంస్థ స్పందించకపోవడంతో.. కళాభవన్‌ను అధికారులు తాజాగా సీజ్ చేశారు. సుచిరిండియా కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు.