Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
సీఆర్పీఎఫ్ జవాన్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చీకోటి గార్డెన్ ప్రాంతంలో నివసిస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవేంద్ర కుమార్(25) సీఆర్పీఎఫ్ ఐజీ మహేష్ లడ్డా నివాసం వద్ద సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం అతను తన నివాసం వద్ద రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. గమనించిన తోటి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే దేవేంద్రకుమార్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దేవేంద్ర జేబులో ఉత్తరం ఉన్నట్టు గుర్తించారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు. దేవేంద్ర కుమార్ 2021 బ్యాచ్‌కు చెందినట్టు ఉద్యోగిగా తోటి ఉద్యోగులు వెల్లడించారు.