Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేసిన కోర్టు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయప్రతినిధి
పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కు ఊరట లభించింది. ఆయన నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. బెయిల్ రద్దు చేయా లంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను హన్మ కొండ కోర్టు కొట్టివేసింది. బండి సంజరుకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఈనెల 17న హన్మకొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై గురువారం కోర్టు విచారణ చేపట్టింది. బెయిల్ మంజూరు చేసిన సమయంలో సూచించిన నియమాలు, నిబంధనలు బండి సంజయ్ ఉల్లంఘించా రని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. విచారణకు సహక రించడం లేదని, ఫోన్ కూడా ఇవ్వలేదని కోర్టుకు నివేదిం చారు. అయితే ప్రాసిక్యూషన్ వాదనలతో మెజిస్రేట్ విబే ధిస్తూ.. బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.