Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాసంగి మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు నిర్ణయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. యాసంగిలో దాదాపు 6.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైందనీ, 17.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో సాగు చేశారని తెలిపారు. మొక్కజొన్న క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర రూ.1962 ఉందనీ, అందుకనుగుణంగా కేంద్రాల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.