Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ముగ్గురికి తీవ్రగాయాలు
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం నిజామాబాద్ నుంచి బోధన్ మండలం ఊట్పల్లికి డ్రైవర్ సహా తొమ్మిది మంది భవన నిర్మాణ కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన బోలెరోపికప్ వాహనం ఢకొీట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ప్రశాంత్ (డ్రైవర్)(35), చరణ్ నాయక్ (25), డి.శ్యాం(48) అక్కడికక్కడే చనిపోయారు. రేఖ(32) ఆస్పత్రిలో మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన శేఖర్, కృష్ణ, ఆర్.కృష్ణను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
నిజామాబాద్లో కొత్తగా ప్రభుత్వం నిర్మిస్తున్న ఐటి హబ్ నిర్మాణంలో పనులు చేసి కూలీలు ఇంటికి తిరిగి పోతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఘటనా స్థలంలో ఆరో టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, రూరల్ నార్త్ సీఐ నరహరి, ఎస్ఐ సాయికుమార్ సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.