Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తెలుగుదేశం తెలంగాణ శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమితు లైన నందమూరి సుహాసినికి ఆపార్టీ నేతలు పలువురు అభినందనలు తెలియజేశారు. గురువారం హైదరా బాద్‌లోని ఆమె నివాసంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద ర్భంగా ఆమెను శాలువాతో సత్కరిం చారు. పార్టీకి సంబం ధించి పలు అంశాలపై చర్చించారు. తాజాగా తెలంగాణలో చేపట్టిన పార్టీ కార్యక్రమాలు, త్వరలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ప్రత్యేక సభల గురించి సుహాసినికి వీరేష్ వివరించారు. ఈ సందర్భంగా సుహాసిని స్పందిస్తూ పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ను త్వరలోనే స్వ యంగా కలుస్తాననీ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని చెప్పారు.