Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
- రాష్ట్ర సదస్సులో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్
- జూన్ 8న హైదరాబాద్‌లో మహాధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 475 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), 30 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల (యూఆర్ఎస్)లో పనిచేస్తున్న 12,500 ఉద్యోగులకు మూలవేతనం ఇవ్వాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఇదే డిమాండ్లపై హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం రాష్ట్ర సదస్సును నిర్వహించారు. కేజీబీవీ, యూఆర్ఎస్లలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాట కార్యక్రమాలు నిర్వహించాలని ఆ సదస్సు నిర్ణయించింది. జూన్ ఎనిమిదో తేదీన హైదరాబాద్‌లో మహాధర్నా చేపట్టనున్నట్టు పిలుపు నిచ్చింది. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్
దుర్గాభవాని అధ్యక్షతన నిర్వహిం చిన ఈ కార్య క్రమంలో నర్సిరెడ్డి మాట్లాడుతూ కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్ నుంచి వర్కర్ వరకు అందరూ మహిళా ఉద్యోగులే కష్టపడి పని చేసి అద్భుతమైన ఫలితాలు సాధిస్తు న్నారని చెప్పారు. అయినా ప్రభుత్వం నుంచి వారికి తగిన గుర్తింపు లభిం చటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేజీబీవీ, యూఆర్ఎస్ ఉద్యోగు లందరూ సం ఘటితంగా నిర్వహిం చిన పోరాటాల ఫలి తంగా కొన్ని సమ స్యలు పరిష్కారం అయినప్పటికీ ఇంకా పరి ష్కారం కావాల్సి నవి చాలా ఉన్నాయని అన్నారు. సమ స్యల పరి ష్కారం కోసం నిర్వహించే పోరా టానికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటిం చారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య మాట్లాడుతూ పీఆర్సీ సిఫారసు చేసిన విధంగా కేజీబీవీ, యూఆర్ఎస్ కాంట్రాక్టు ఉద్యో గులకు ఇంక్రిమెంట్లు, సెలవు లివ్వాలని డిమాండ్ చేశారు. టీఎస్ యూటీ ఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లా డుతూ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా చేపట్ట నున్న ఉద్యమ కార్యాచరణను ప్రతిపాదిం చారు. రాష్ట్ర ప్రభు త్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు వి శాంతికుమారి, జి నాగ మణి, వై జ్ఞాన మంజరి, లక్ష్మి, విశాల, లక్ష్మారెడ్డి, పి మాణిక్ రెడ్డి, సోమశేఖర్, సింహాచలం, వెంకట్ పాల్గొన్నారు.
ఉద్యమ కార్యాచరణ
- రాష్ట్ర సబ్ కమిటీ ఆధ్వర్యంలో విద్యా మంత్రి, ఆర్థిక మంత్రి, విద్యాశాఖ అధికారులకు వచ్చేనెల 8,9 తేదీల్లో వినతిపత్రాల సమర్పణ.
- వచ్చేనెల 1 నుండి జూన్ 30 వరకు కేజీబీవీ జిల్లా కన్వీనింగ్ కమిటీల ఏర్పాటు.
- వచ్చేనెల 22న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు
- జూన్ 1,2 తేదీల్లో జిల్లా కన్వీనింగ్ కమిటీల ఆధ్వ ర్యంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాల సమర్పణ.
- జూన్ 8న హైదరాబాద్‌లో మహాధర్నా.
డిమాండ్లు
- సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేజీబీవీ, యూఆర్ఎస్ ఉద్యోగులందరికీ వారు పనిచేస్తున్న పోస్ట్ ప్రకారం మూల వేతనం (బేసిక్ పే ) చెల్లించాలి.
- ఎస్ఓను ప్రిన్సిపాల్‌గా, పీజీసీిఆర్టీలను జేఎల్స్‌గా, సీఆర్టీలను స్కూల్ అసిస్టెంట్లుగా, పీఈటీలను పీడీలుగా గుర్తించి ఆ పోస్ట్ బేసిక్ పేను ఇవ్వాలి.
- హాస్టల్ నిర్వహణ కోసం కేర్ టేకర్ ను నియమించాలి. సీఆర్టీలకు నైట్ డ్యూటీల నుంచి మినహాయింపునివ్వాలి.
- పీఆర్సీ సిఫారసు చేసిన విధంగా కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు ఏటా రూ.1000 ఇంక్రిమెంట్ ఇవ్వాలి.
- కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీకి అనుగుణంగా కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులను కూడా (అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి) రెగ్యులరైజ్ చేయాలి.
- కేజీబీవీ, యూఆర్ఎస్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు ఇచ్చి నగదు రహిత వైద్యం అందించాలి.
- అర్ధాంతరంగా మరణించిన కేజీబీవీ, యూఆర్ఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.
- యూఆర్ఎస్లకు స్వంత భవనాలు నిర్మించాలి.
- కేజీబీవీ, యూఆర్ఎస్ ఉద్యోగులకు బదిలీలు నిర్వహించాలి.