Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్రంగా గాయపడి మృతి
నవతెలంగాణ - బంజారాహిల్స్
తాగి గొడవ చేయొద్దన్నందుకు ఓ లాడ్జి వాచ్‌మెన్‌ను యువకులు భవనం పై నుంచి తోసేయడంతో అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..
బంజారాహిల్స్ కృష్ణానగర్‌లో శ్రీ రాఘవేంద్ర లాడ్జిలో యాదగిరి(52) అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఓ సినిమా పాట షూటింగ్ కోసం చెన్నై నుంచి 12 మంది డాన్సర్లు హైదరాబాద్ వచ్చారు. కృష్ణానగర్‌లోని రాఘవేంద్ర లాడ్జిలో వారు బస చేశారు. గురువారం అర్ధరాత్రి అంతా కలిసి లాడ్జి టెర్రస్‌పై మద్యం సేవించి అల్లరి చేశారు. దాంతో వాచ్మెన్ యాదగిరి పైకి వెళ్లి గొడవ చేయొద్దంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, మద్యం మత్తులో ఉన్న మణికంఠ అనే డాన్సర్ వాచ్‌మెన్‌ను కొట్టాడు. మొబైల్ లాక్కొని పగులగొట్టాడు. అంతటితో ఆగకుండా యాదగిరిని కొడుతూ మూడో అంతస్తులోకి లాక్కొచ్చి కిటికీ నుంచి కిందకు తోసేశాడు. తీవ్రంగా గాయపడిన యాదగిరిని ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి చనిపోయాడు. ఈ మేరకు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవీస్ లాడ్జికి చేరుకొని క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.