Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెల్త్ స్కీమ్ రూ.5 లక్షలకు పెంచాలి
- అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టు రూపొందించాలి
- ఐలూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బార్‌కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని అడ్వకేట్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం పది గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరా పార్కువ వద్ద ధర్నా చేయనున్నట్టు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన ్(ఐలూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్టేట్ బార్‌కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ ప్రకటించారు. ఈ ధర్నాలో న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 2019 తర్వాత రాష్ట్రంలో కొత్తగా 12 వేల మంది న్యాయవాదులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనీ, వారికి మెడికల్ స్కీమ్ అమలు కావడం లేదని తెలిపారు. వారందరికీ హెల్త్కార్డులివ్వాలని కోరారు. న్యాయవాదుల తల్లిదండ్రులకు కూడా ఆ స్కీమ్ వర్తించేలా చూడాలని కోరారు. మెడికల్ స్కీమ్‌ని రూ.2 లక్షలకే పరిమితం చేయడం సరిగాదని పేర్కొన్నారు. దాన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. మెటర్నిటీ కవరేజీని మెడికల్ స్కీమ్‌లో చేర్చాలని విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల కోసం రూ.100 కోట్లు కేటాయించడం మంచి పరిణామేననీ, అయితే దాని అమలు తీరు సరిగా ఉండేలా చూడాలని కోరారు. 9 మందితో కూడిన సలహామండలిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. సమాజానికి న్యాయసేవలందిస్తున్న వారికి రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేయడం సరిగాదని పేర్కొన్నారు. దీనివల్ల కొందరు అడ్వకేట్లు తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. దేశంలో న్యాయవాదులపై దాడులు పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపైనే ఇందిరాపార్కు వద్ద శనివారం ధర్నా చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని న్యాయవాదులకు ఆయన పిలుపునిచ్చారు.