Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరిహద్దు జిల్లాల ఎస్పీలకు డీజీపీ సూచన
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ బాంబును ప్రయోగించి 10 మంది సాయుధ పోలీసులను బలిగొన్న సంఘట నను కేస్ స్టడీగా తీసుకోవాలని రాష్ట్ర పోలీసులకు డీజీపీ అంజనీకుమార్ సూచించారు. దండకారణ్యంలో ఆప రేషన్‌ను పూర్తిచేసుకుని వస్తున్న సాయుధ పోలీసుల కన్వారుపై మావోయిస్టుల దాడి ఆషామాసీఃగా తీసుకునే విషయం కాదని అన్నారు. ముఖ్యంగా అక్కడి పోలీసు స్టేషన్‌తో పాటు సీఆర్పీఎఫ్ క్యాంప్‌కు 1.4 కి.మీ. దూరంలోనే ఈ దాడికి మావోయిస్టులు సాహసించడం వారి తెగువను చూపిస్తున్నదని డీజీపీ అన్నారు. ఇటీవలి కాలంలో ఇది అతి పెద్ద ఘటనగా ఆయన అభివర్ణించారు.