Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.75వేలు తీసుకుంటూ..
నవతెలంగాణ - వంగూరు
నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలంలోని శేరప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పొలం రిజిస్ట్రేషన్ కోసం రూ.75 వేలు లంచం తీసుకుంటూ తహసీల్దార్ ఏసీబీకి చిక్కినట్టు డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 120,121,122సర్వే నెంబర్లలో గల 12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ కోసం బాధితులు ఫిబ్రవరి నుంచి తహసీల్దార్ నాగమణిని కలుస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చివరకు డాక్యుమెంటుకు 25 వేల లెక్కన 8 డాక్యుమెంట్లకుగాను రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దిక్కుతోచని స్థితిలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించి తమ గోడు చెప్పుకున్నారు. మొదట నాలుగు డాక్యుమెంట్లకుగాను రూ.75 వేలు ఇస్తానని సెటిల్మెంట్ చేసుకొని, శుక్రవారం ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ధరణి ఆపరేటర్ రాజు, వీఆర్ఏ భర్త వెంకటయ్య మధ్యవర్తులుగా పెట్టి రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్‌తోపాటు వారిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి విచారణ చేపట్టి నిందితులను నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.