Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 75ఏండ్లలో చేయలేనిది ఐదేండ్లలో మోడీ చేశారు
- ఎన్ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జనరల్ నరేంద్రకుమార్
- మన్‌కీబాత్ స్టడీ రిపోర్టు విడుదల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'2047 వరకు వికాసిత్ భారతే లక్ష్యంగా మోడీ సర్కార్ కార్యక్రమాలు చేపడుతున్నది. 75ఏండ్లలో సరైన నేతృత్వం లేకపోవడంతో అభివృద్ధి జరగలేదు. కానీ ఐదేండ్లలోనే మోడీ అభివృద్ధి చేసి చూపించారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా వార్తలు రాస్తున్నది' అని ఎన్ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జనరల్ నరేంద్రకుమార్ అన్నారు. ప్రధాని మోడీ మన్‌కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను పురస్కరించుకుని జాతీయ గ్రామీణాభివద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్ఐఆర్డీపీఆర్) రెండు ప్రధాన గ్రామీణాభివద్ధి పథకాలైన 'స్వయం సహాయక బందాలు, అమత్ సరోవర్ మిషన్లు- మన్‌కీ బాత్ కార్యక్రమం ప్రభావం'పై శుక్రవారం ఒక నివేదికను అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్, గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు ప్రవీణ్ మహతో సమక్షంలో హైదరాబాద్ క్యాంపస్‌లో నరేంద్రకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మన్ కీ బాత్ కార్యక్రమాల్లో ప్రధాని చేసిన వ్యాఖ్యలు స్వయం సహాయక సంఘాల్లో పరివర్తనాత్మక మార్పులను ఎలా సష్టించాయో వివరించారు. అధికారుల బృందం అధ్యయనం చేసిన 6 స్వయం సహాయక సంఘాల క్రాస్ కేస్ విశ్లేషణలో వారి సామాజిక, ఆర్థిక లాభాలలో మన్ కీ బాత్ ప్రస్తావనల తర్వాత గణనీయమైన మార్పులు వచ్చేట్టు వెల్లడైందని అన్నారు. గతంలో స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు పొదుపు చేసుకుని ఆర్థికంగా బలపడి వడ్డీవ్యాపారులను అడ్డుకున్నారు తప్ప సూక్ష్మ తరహా పరిశ్రమలను స్ధాపించే స్థాయి రాలేదని తెలిపారు.