Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల నిర్మూలన వేదిక విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కుల నిర్మూలన వేదిక కార్యదర్శి కోట ఆనందరావును వెంటనే విడుదల చేయాలని కుల నిర్మూలన వేదిక రాష్ట్ర కమిటీ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాపని నాగరాజు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోట ఆనందరావు ఉస్మానియా యూనివర్సిటీ విద్యాలయంలో పరిశోధన విద్యార్థి. గురువారం తన స్వగ్రామానికి వెళ్లిన సమయంలో రాత్రి మూడు గంటలకు సిర్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కుటుంబ సభ్యుల నుండి సమాచారం అందిందని నాగరాజు పేర్కొన్నారు. ఆయన కుల నిర్మూలన వేదిక రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారని, తన గ్రామంలోని సమస్యలతోపాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే కోనప్ప దష్టికి, ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లే ప్రయత్నం సీరియస్గా చేస్తున్నారని గుర్తుచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ సాధన కోసం కషి చేశారని తెలిపారు. ఆనందరావు విడుదల కోసం పోలీసులు, ఎమ్మెల్యే కషి చేయాలని విజ్ఞప్తి చేశారు.