Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద.మ.రైల్వే జీఎమ్ అరుణ్‌కుమార్ జైన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైల్వే లైన్ల భద్రతకు అధికారులు, సిబ్బంది తొలి ప్రాధాన్యత ఇవ్వాలనీ, దీనికోసం ఎప్పటికప్పుడు నిరంతర తనిఖీలు చేపట్టాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. శుక్రవారంనాడాయన నాందేడ్ డివిజన్లోని ఆదిలాబాద్ - నాందేడ్ సెక్షన్‌ను తనిఖీ చేశారు. నాందేడ్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీమతి నీతి సర్కార్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. తొలుత ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీలు జరిపారు. అక్కడి స్టేషన్ పరిసరాలు, పార్కింగ్, రిజర్వేషన్, టిక్కెటింగ్, వెయిటింగ్ హాల్, టాయిలెట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, బేబీ ఫీడింగ్ రూమ్‌తో పాటు ఇతర సౌకర్యాలన్నింటినీ పరిశీలించారు.