Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ ఆశయాల మేరకు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని పౌరసరఫరాలు, బీసీ సంక్షేమశాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. సచివాలయానికి శాఖల తరలింపు నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్తో సమీక్షించారు. ఆదివారం నూతన సచివాలయంలో తొలి సంతకం చేయబోయే ఫైలుకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆహ్వానాలు
మే 14న చెన్నైలో జరిగే తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా మంత్రి గంగుల కమలాకర్ను బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) అమెరికాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్లో జూలైలో నిర్వహిస్తున్న 23వ తానా మహాసభలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా మంత్రిని ఆహ్వానించింది. ఈమేరకు తానా ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందజేశారు.