Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్ సీఎంకు కేసీఆర్ లేఖ రాయాలి
- ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య 1994లో బీహార్‌లో హత్యకు గురయ్యారనీ, ఆ కేసులో జైల్లో ఉన్న నిందితుడు ఆనంద్ మోహన్‌ను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంటే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఎందుకు మౌనంగా ఉంటున్నారని బహుజనసమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. హంతకుడు ఆనంద్‌మోహన్ విడుదల కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ జైలు నిబంధనల్నే మార్చడం సరికాదన్నారు. దీనిపై నిరసన తెలుపుతూ సీఎం కేసీఆర్ బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
పరీక్షలు వాయిదా వేయాలి
ఈ నెల 30న ఒకేరోజు నాలుగు పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారనీ, ఈ షెడ్యూల్‌ను మార్చాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏక కాలంలో పరీక్షులు ఎలా రాయగలుగుతారని ప్రశ్నించారు.