Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇస్తాం : మహేష్‌కుమార్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వడగండ్ల వర్షాలతో పంటలు, పండ్ల తోటలు భారీగా దెబ్బతిన్నాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరుపున నాలుగు బృందాలు పర్యటిస్తాయని చెప్పారు. అనంతరం రైతుల బాధలు, కష్టాలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి వినతిపత్రాలిస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు ఎం కోదండరెడ్డి,గడ్డం ప్రసాద్ కుమార్, అన్వేష్‌రెడ్డి, కోట నీలిమాతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితులు అధ్వాన్నంగా మారాయనీ, వారి వెంటనే అందుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో వ్యవసాయ అత్యవసర పరిస్థితి వెంటనే ప్రకటించి, రైతులను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మెదక్, రంగారెడ్డి జిల్లాలకు గడ్డం ప్రసాద్‌కుమార్ బృందం, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు పి బలరాంనాయక్ బృందం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు టి జీవన్‌రెడ్డి బృందం, వరంగల్ జిల్లాకు ఇ అనిల్‌కుమార్ బృందం పర్యటిస్తాయని తెలిపారు.