Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవతారాయ్ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దళిద బందుపై బీఆర్ఎస్ బందిపోట్లు దాడి చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం లబ్దిదారుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారంటూ సీఎం స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు. తమ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తుంటే, గుడ్డిగా కండ్లు మూసుకుని సీఎం కాపాడుతున్నారని ఆరోపించారు. అవినీతి పరుల ఎమ్మెల్యేల జాబితాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో కేసీఆర్, మద్యం కమీషన్లలో కవిత, భూ కుంభ కోణంలో కేటీఆర్ దోచుకుంటే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు దొరికిన కాడికి దోచుకుం టున్నారని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేష్ మాట్లాడుతూ దళితబందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నా సీఎం ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.