Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఈ నెల 30న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అక్కడ భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ శుక్రవారం పరిశీలిం చారు. ఆయన వెంట నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అదనపు డిజి స్వాతి లక్రా, రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజరు జైన్, నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ సుధీర్ బాబు తదితర ఉన్నతాధికారులున్నారు. నూతన సచి వాలయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నంతో కూడిన భద్రతా ఏర్పాట్లను ఈ సందర్భంగా డీజీపీ పరిశీలించారు.
ముఖ్యంగా సీఎం చాంబర్ మొదలుకుని వివిధ విభాగాలు, బ్లాక్ లను ఆయన తిరిగి చూశారు. ముఖ్యంగా వీవీఐపీలు వచ్చే మార్గం మొదలుకుని సామాన్య విజిటర్స్ వచ్చే మార్గాల్లో ఏర్పాటుచేసిన సెక్యూరిటీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.