Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ విద్య, సాంకేతిక విద్యలో లైబ్రరియన్ పోస్టుల భర్తీ కోసం వచ్చేనెల 17న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (సీబీఆర్టీ) పద్ధతిలో షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యాశాఖ పరిధిలో ఇంటర్ కమిషనరేట్లో 40, సాంకేతిక విద్యాశాఖలో 31 కలిపి మొత్తం 71 లైబ్రెరియన్ పోస్టుల భర్తీకి గతేడాది 31న నోటిఫికేషన్ను విడుదల సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు షషష.్రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ నుంచి పరీక్ష ప్రారంభానికి వారం రోజుల ముందు నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.