Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎన్‌సీ వార్షిక నివేదిక విడుదల
హైదరాబాద్ :మార్పు కోసం నర్సుల నాయకత్వం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్ సీ) తెలిపింది. ఐఎన్‌సీ 2021-22 వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ ఏడాది చేపట్టిన వివరాలను వెల్లడించింది.
నర్సుల నాయకత్వానికి సంబంధించి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ నర్సెస్ ఇప్పటికే 60 దేశాల్లో నిర్వహిస్తున్నది. ప్రస్తుతం ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఈ కార్యక్రమంలో భాగంగా 42 మంది నర్సింగ్, మిడ్ వైఫరీ లీడర్లకు మాస్టర్ ట్రైనర్లుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే విధంగా డాక్టర్ ఆఫ్ నర్సింగ్ ప్రాక్టీస్ (డీఎన్‌పీ)ని అమలు చేసేందుకు వీలుగా యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్తో ఐఎన్‌సీ ఒప్పందం చేసుకుంది. క్రిటికల్ కేర్‌లో నర్స్ ప్రాక్టీషనర్‌గా పూర్తి చేసిన వారు దీనికి అర్హులుగా పేర్కొంది.