Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ ఉత్పత్తుల సదస్సులో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ నినాదానికే పరిమితమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం తన విధానాలను మార్చుకోవాలని కోరారు. పంటల మార్కెటింగ్ అనేది రైతులకు ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం హైదరాబాద్ ఫిక్కీ ఆడిటోరియంలో 'వ్యవసాయ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలు-తెలంగాణ' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మంత్రి మాట్లాడారు. అత్యధిక మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. అందుకే సాగునీరు, కరెంటు, రైతుబంధుతో వ్యవసాయరంగానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ నీరజా ప్రభాకర్, టీఎస్‌టీపీసీ జేఎండీ విష్ణువర్దన్ రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్, వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ సింఘాల్ తదితరులు ఉన్నారు.