Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
నవతెలంగాణ- జగిత్యాలటౌన్
దళితబంధు పథకం అమలులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారా అంటూ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. జగిత్యాల పట్టణంలోని స్థానిక ఇందిరాభవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. దళితబంధు పథకం తన ఆత్మబంధు వంటిదని చెప్పిన సీఎం కేసీఆర్.. పథకం అమలులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అవినీతి ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని చెప్పిన కేసీఆర్ ఆ ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం పరోక్షంగా వారి అవినీతిని ప్రోత్సాహించినట్టేనని అన్నారు. దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యపై ఆరోపణలు వచ్చిన వెంటనే పదవి నుంచి తొలగించిన కేసీఆర్.. అవినీతిపై ఎమ్మెల్యేలకు సంబంధించి ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దళితబంధు ప్రతి ఒక్కరికీ ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం కేవలం మీడియాలో ప్రకటనలతోనే పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గంలోని 1,500 మందికి లబ్ది చేకుర్చుతామని రూ.15,700 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేసి ఇప్పటికీ రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు.
మీ కుమారుడికి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందిస్తూ.. అది తన చేతుల్లో లేదని అయినా రాజకీయం అనేది ఇస్తే వచ్చేది కాదన్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఇద్దరూ తండ్రి ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ వారు ఇంటెలిజెంట్స్ అని ఒప్పుకోవాల్సిందే అన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.