Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్క్‌షాప్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సంప్రదాయ డిగ్రీ కోర్సుల కు నైపుణ్యాలను జోడిస్తే, మార్కెట్లో తిరుగులేని ఉపాధి లభిస్తుందని, తద్వారా విద్యార్థు లకు బంగారు భవిత ఉంటుం దని ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అన్నారు. ఈ దిశగానే రాష్ట్రంలో స్కిల్ ఆధారిత డిగ్రీ కోర్సులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించామని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే నైపుణ్య ఆధారిత డిగ్రీ కోర్సులను కొన్ని కాలేజీల్లో ప్రవేశపెట్టబోతున్నట్టు చెప్పారు. ఉన్నత విద్యామండలి, సెంటర్ ఫర్ రీసెర్చ్ స్కీమ్స్ అండ్ పాలసీస్ (సీఆర్ఐఎస్పీ) సంయుక్తంగా 'ఉన్నత విద్యలో పారిశ్రామిక నైపుణ్యాల ఏకీకృత విధానం'పై శుక్రవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ సాధారణ డిగ్రీ కోర్సులను నైపుణ్యాలతో అందించే దిశగా కేంద్రం కొన్ని స్కిల్ కోర్సులను అందుబాటులోకి తేవాలని భావిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో వర్క్‌షాపులో నిపుణులతో చర్చించామని వివరించారు. కోర్సులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, పరిశ్రమల్లో నైపుణ్యాలు పొందే వెసులుబాటు అవకాశాలు, బోధన ప్రణాళికలో తేవాల్సిన మార్పులపై నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారని అన్నారు. వచ్చేనెల ఒకటో తేదీన ఈ కోర్సులకు సంబంధించి మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఆ సమావేశంలో కార్యాచరణ చేపట్టాలని తీర్మానిం చామని అన్నారు. ఈ కార్యక్రమం లో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, భారత ప్రభుత్వ విద్యా శాఖ మాజీ కార్యదర్శి ఆర్ సుబ్ర మణ్యం, రిటైర్డ్ ఐఏఎస్ విఎల్వి ఎస్ఎస్ సుబ్బారావు, ఓయూ వీసీ డి రవీందర్, ఎస్‌యూ వీసీ ఎస్ మల్లేశ్, ఎంజీయూ వీసీ సిహెచ్ గోపాల్‌రెడ్డి, తెలంగాణ మహిళా వర్సిటీ వీసీ ఎం విజ్జు లతతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కు చెందిన విద్యారంగ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.