Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి సంక్షేమం, అభివద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు
- సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదనీ, ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనివిధంగా నేతన్నల సంక్షేమం కోసం విభిన్న కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత శాఖపై శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షాసమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చేనేత,జౌళి శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేతన్నలకు అత్యంత సులువుగా ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా అధికారులు తమ కార్యాచరణ కొనసాగించాలని అన్నారు.
రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఒక ప్రాధాన్యత రంగంగా తమ ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మినీ టెక్స్టైల్ పార్కులు, టెక్స్టైల్ పార్కులు, ఆప్పారెల్ పార్కుల అభివద్ధి పరిచామని వివరించారు. ఆయా పార్కుల్లో ఇంకా మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే వెంటనే వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో బ్లాక్ లెవెల్ క్లస్టర్ల పనితీరుపైనా, వాటి పురోగతి పైనా ఒక నివేదికను వెంటనే తయారుచేసి అందివ్వాలని ఆదేశించారు. గుండ్ల పోచంపల్లి అప్పారెల్ పార్క్, గద్వాల్ హ్యాండ్లూమ్ పార్క్ కార్యక్రమాలపైన కేటీఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు.
చేనేత రంగంలోని నేతన్నల కళకు, వత్తికి మరింత ఆదాయం వచ్చేలా తీసుకోవాల్సిన కార్యక్రమాలపైన అధ్యాయనం చేయాలని అధికారులను మంత్రి ఈ సందర్బంగా కోరారు. చేనేత కార్మికులు అధికంగా ఉన్న నారాయణపేట, గద్వాల్, దుబ్బాక, కొడకండ్ల, మహాదేవపూర్, కొత్తకోట వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన పనులపైన అధికారులు క్షేత్రస్థాయిలో మరింత అధ్యయనం చేసి, ప్రస్తుతమున్న పరిస్థితులకు అనుగుణంగా ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆగస్టు 7న జరిగే జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆ రంగంలోని అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న నేతన్నలకు గుర్తింపునిచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో చేనేత మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఒకవైపు చేనేతల అభివద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను భారీ ఎత్తున కొనసాగిస్తూనే, వారి ఉపాధి కోసం నేతన్నలు విస్తతంగా ఆధారపడిన పవర్లూమ్ రంగం అభివృద్ది కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు. ఇందుకోసం దేశంలోనే అత్యంత ఆదర్శంగా ఉన్న తమిళనాడులోని తిర్పూర్ క్లస్టర్ మాదిరి ఒక సమీకత పద్ధతిన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన పవర్లూమ్ క్లస్టర్లను రాష్ట్రంలో అభివద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అక్కడ ఉన్న ఆదర్శవంతమైన పద్ధతులను, అక్కడి నేతన్నలు తమ వత్తి నైపుణ్యాన్ని పెంచుకున్న తీరును, వారు అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ), జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా చేస్తున్న నేత ఉత్పత్తుల తయారీ వంటి అనేక అంశాలపైనా విస్తతంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చేనేత, పవర్లూమ్ కార్పొరేషన్ల చైెర్మెన్లు ఎల్. రమణ, గూడురిప్రవీణ్తోపాటు టెక్స్టైల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.