Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ఆందోళనకు సాయం చేసినందుకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నిర్ణయం
- బీజేపీ అనుబంధ బీఎంఎస్ ఫిర్యాదుతోనే ఈ చర్యలు
- సంఘాల రద్దును ఖండించిన సీఐటీయూ
- ప్రయివేటీకరణను వ్యతిరేకించినందుకే సంఘాల రద్దు :యూనియన్ నేతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రైతుల ఆందోళనకు ఆర్థిక సాయం చేశారనే కారణంతో దేశంలోని మెజారిటీ తపాలా ఉద్యోగుల మద్దతు ఉన్న ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐపీఈయూ), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ (ఎన్ఎఫ్పీఈ) ల గుర్తింపును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రైతుల నిరస నలకు సాయం చేయడంతో పాటు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) సాయం, సీపీఐ(ఎం) కార్యా లయం నుంచి పుస్తకాలు కొనుగోలు చేసి నందుకు ఈ రెండు సంఘాల గుర్తింపును రద్దు చేసింది. సెంట్రల్ సివిల్ సర్వీ సెస్ (సర్వీస్ అసోసియేషన్ గుర్తింపు) రూల్స్-1993 ఆధా రంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ పోస్టల్ సంఘం భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (బీపీఈఏ) ఫిర్యాదుతోనే ఈ చర్యలు తీసుకుందని విమర్శలు వెల్లువెత్తు న్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సీఐటీయూ ఖండించిం ది. 1920లో కలకత్తాలో ఏర్పాటైన ఏఐపీఈయూ, దేశంలోని పురాతన యూనియన్లలో ఒకటి. ఎన్ఎఫ్పీఈ అనేది ఏఐ పీఈయూతో సహా ఎనిమిది పోస్టల్ ఉద్యోగుల సంఘాలతో అనుబంధంగా ఉన్న రంగంలో అతిపెద్ద సమాఖ్య.
2021 మార్చి 31న రైతు ఉద్యమానికి రూ.30 వేలను ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ గ్రూప్ 'సి' ఖాతా నుంచి చెల్లించినట్టు కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. రాజకీయాలకతీతంగా రైతుల ఆందోళనకు సహాయ సహ కారాలు అందించాలన్న సమాఖ్య వాదనను ప్రభుత్వం అంగీ కరించలేదు. ఫెడరేషన్, దాని అనుబంధ సంస్థలు రూ. 4,935 ఖర్చుచేసి సీపీఐ(ఎం) నుంచి పుస్తకాలు కొనుగోలు చేశాయని, సీఐటీయూకి రూ.50 వేలు విరాళంగా ఇచ్చా యని ప్రభుత్వం ఆరోపించింది.ఇదిలా ఉండగా దాదాపు రూ.17 లక్షల కోట్ల విలువైన ఆర్థిక సేవల వ్యాపారాన్ని కలిగి ఉన్న పోస్టల్ శాఖ కార్యకలాపాలను ప్రయివేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఎన్ఎఫ్పీఈ ప్రతిఘటిం చడంతో కేంద్రం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ఉద్యోగులు సమ్మెకు దిగారు. పదేండ్ల క్రితం, ఉద్యోగుల మధ్య జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 75 శాతం ఓట్లతో ఎన్ఎఫ్పీఈ ఆమోదించ బడింది. అపుడు బీఎంఎస్ సంస్థకు ఐదు శాతం ఓట్లు మాత్ర మే వచ్చాయి. వచ్చే ఏడాది మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ జరగనుండగా, ఈ సమయంలో సంస్థాగత కార్యకలాపా లను ముగించే లక్ష్యంతో కేంద్రం ఈ చర్య తీసుకున్నట్టు ఎన్ఎఫ్పీఈ ప్రధాన కార్యదర్శి పికె మురళీధరన్ విమర్శిం చారు. పోస్టల్ శాఖలోని నాలుగున్నర లక్షల మంది ఉద్యోగు ల్లో మూడు లక్షల మందికి పైగా ఉద్యోగుల మద్దతు ఎన్ఎఫ్పీఈకి ఉంది. సైద్ధాంతిక స్థానం ఆధారంగా సంస్థ తీసుకునే ఏ నిర్ణయానికైనా ఉద్యోగుల మద్దతు ఉంటుంది. ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సాంప్రదాయ సంఘమని పేర్కొన్నారు. ఇటీవలి ప్రభుత్వ నిర్ణయాలపై సంఘం అన్ని స్థాయిల్లో గట్టిగా పోరాడుతోందని మురళీ ధరన్ అన్నారు. 1960వ దశకంలో రెండుసార్లు, తరువాత ఎమర్జెన్సీ సమయంలో సంఘం (అప్పటి ఎన్ఎఫ్పీటీఈ)ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ చాలా మంది ఉద్యోగులు సంస్థకు తిరిగి వచ్చారు.
పనికిమాలిన కారణాలతో గుర్తింపు రద్ద్ణు సీఐటీయూ
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ (ఎన్ఎఫ్ పీఈ), ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూని యన్ గ్రూప్-సీ గుర్తింపును పనికిమాలిన కారణాలతో రద్దు చేసిన ప్రతీకార చర్యలను సీఐటీయూ ఖండించింది. ఈ మేరకు శుక్రవారం సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ ప్రకటన విడుదల చేశారు. తపాలా శాఖలో మెజారిటీ యూనియన్ (70శాతం ఉద్యోగుల మద్దతు) అయిన ఎన్ఎఫ్పీఈకి గుర్తిం పును ఉపసంహరించుకున్న ఆర్ఎస్ఎస్-బీజేపీ ప్రభుత్వ తీవ్ర ప్రతీకార కార్మిక వ్యతిరేక చర్యను ఖండిస్తోందని అన్నా రు. విధ్వంసకర, కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు, ఉద్యోగుల పోరాటం చేయకుండా ఉండేందుకు ఇవి ప్రభుత్వం చేపట్టిన క్రూరమైన చర్యలు తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. ఈ చర్యలను మానుకోవాలని అన్నారు. రైతాం గం వంటి తోటి శ్రామిక ప్రజలకు సంఘీభావం తెలియ జేయడమే కాకుండా, ఇప్పుడు ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎన్ఎఫ్పీఈ తీవ్రంగా ప్రతిఘటిస్తోం దని అన్నారు. తపాలా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి ప్రతీకార చర్యలకు వ్యతిరేకంగా నిర్వ హించే నిరసన పోరాటాలకు సీఐటీయూ సంపూర్ణ మద్దతుని స్తుందని తెలిపారు. కార్మిక సంఘాల హక్కులపై ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి ప్రేరేపిత దాడికి వ్యతిరేకంగా శ్రామిక ప్రజలు తమ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు. ఎన్ ఎఫ్పీఈ, ఏఐపీఈయూలపై ప్రతీకారాత్మకమైన గుర్తింపు రద్దు ఉత్తర్వును బేషరతుగా ఉపసంహరించుకోవాలని ప్రభు త్వం, పోస్టల్ శాఖను సీఐటీయూ డిమాండ్ చేస్తుందని అన్నారు.