Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మగౌరవం ఇనుమడించేలా కొత్త సచివాలయం
- సకల జనుల సంక్షేమ పాలనే లక్ష్యం : కేసీఆర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
అనేక త్యాగాలు, శాంతియుత పార్లమెంటరీ పంథాతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతి కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట మహోన్నతంగా వెలుగులీనేలా, ప్రజల ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వినూత్నరీతిలో అత్యద్భుతంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించుకున్నామని చెప్పారు. ఇది యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భమని వ్యాఖ్యానించారు. ''డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం'' ప్రారంభోత్సవ శుభ సందర్భంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక అపోహలు సష్టించిన విమర్శలు అడ్డంకులను దాటుకుంటూ ధఢ సంకల్పంతో ప్రారంభమైన నూతన సచివాలయ నిర్మాణం, అనతి కాలంలోనే దేశానికే వన్నె తెచ్చేలా పూర్తయి, ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల సీిఎం హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాల పరిపాలన అవసరాలను దష్టిలో ఉంచుకుని అత్యంత గొప్ప సాంకేతిక విలువలతో కూడిన నిర్మాణ కౌశలంతో సెక్రటేరియట్ పూర్తయిందన్నారు. అన్ని రకాల ప్రమాణాలను పాటిస్తూ, అనేక విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ సౌధం, దేశంలోనే తొలి పర్యావరణ అనుకూల మహాద్భుత కట్టడమని సీఎం వ్యాఖ్యానించారు. ప్రశాంతతను ప్రసాదించే దేవాలయం మాదిరి, చూస్తేనే కడుపు నిండే విధంగా.. అత్యంత ఆహ్లాదభరిత వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేలా నిర్మితమైన సచివాలయం, ప్రభుత్వ యంత్రాంగం పనితీరును గొప్పగా ప్రభావితం చేస్తూ గుణాత్మక మార్పుకు బాటలు వేయనున్నదని చెప్పారు. మార్పుకను గుణంగా ఎప్పటికప్పుడు తమను తాము తీర్చిదిద్దుకుంటూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ, వాటిని సాకారం చేసేందుకు సుపరిపాలన సాగేలా సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందని సీిఎం వివరించారు. ఒక రాష్ట్ర సచివాలయానికి డా. బీఆర్. అంబేద్కర్ పేరును పెట్టడం దేశంలోనే మొదటిసారి అని సీఎం తెలిపారు. అంబేద్కర్ మహాశయుని పేరు పెట్టుకోవడం వెనక సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీ మహిళా, పేద వర్గాలకు సమాన హక్కులు దక్కాలనే సమున్నత లక్ష్యమున్నదని సీఎం అభిప్రాయపడ్డారు. ఎదురుగా తెలంగాణ అమరుల స్మారక జ్యోతి, పక్కనే ఆకాశమంత ఎత్తున అంబేద్కర్ మహాశయుడు రేపటికి దిక్సూచిగా నిలిచి నిరంతరం ఒక స్పూర్తిని రగిలిస్తుండగా, తెలంగాణ పాలనా సౌధం నుంచి జాతి మెచ్చే సుపరిపాలన రాష్ట్ర ప్రజలకు అందాలనే లక్ష్యంతో, తాత్విక, సైద్దాంతిక అవగాహనతోనే అంబేద్కర్ మహాశయుని పేరును తెలంగాణ సచివాలయానికి పెట్టడం జరిగిందని సీఎం అన్నారు. దేశంలో అత్యంత చిన్న వయసున్న రాష్ట్రంగా, ఇతర రాష్ట్రాలతో పోల్చితే, తెలంగాణ సకల జనుల సంక్షేమ పాలనను దేశానికి ఆదర్శంగా అందిస్తున్నదని సీఎం చెప్పారు. అనతికాలంలోనే తెలంగాణ పాలన ఒక మోడల్‌గా నిలిచిందనీ, ఇది దేశవ్యాప్తంగా విస్తరించేలా తెలంగాణ పాలన నూతన సచివాలయం నుంచి ద్విగుణీకతమ వుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభ దేదీప్యమానమయ్యేలా, దార్శనికతతో సాధించిన ప్రగతి వెలుగుల దారుల్లో, ప్రస్థానం అద్భుతంగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ తన ప్రగాఢ విశ్వాసా న్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌ను అత్యంత గొప్పగా తీర్చిదిద్దడంలో అమోఘమైన పాత్ర పోషించిన, రాల్లెత్తిన కూలీలను, మేస్త్రీలను, నిర్మాణంలో కష్టించి పనిచేసిన అన్ని వత్తుల నిపుణులను, అపురూపంగా మోడల్ అందించిన ఆర్కిటెక్టులను, విరామమెరుగక రేయింబవళ్లు పనిచేసిన కాంట్రాక్టు ఏజెన్సీలను, వారి ఇంజినీర్లను, ఆర్ అండ్ బి శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను, ఇంజినీర్లను, సిబ్బందిని, నిర్మాణంలో పాల్గొన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతి ఒక్కరినీ పేరు పేరునా సీఎం కేసీఆర్ అభినందించారు. ఈమేరకు శనివారం సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది.