Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్ సాధన సమితి ఆవిర్భావం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్ సాధన సమితి (డీసీఎస్ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపకులు నాగళ్ల పోచయ్య (ఇశ్రాయేల్) డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ కూకట్ పల్లి ఎల్లమ్మబండ క్రైస్ట్ బిలీవర్స్ చర్చిలో ఆ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిషప్ సామ్యేల్ ఆధ్వర్యంలో సమితి ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పోచయ్య మాట్లాడుతూ దళితుల మత స్వేచ్ఛను హరించడం భావ్యం కాదన్నారు. ఎస్సీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి, ఆ దిశగా ప్రయత్నం చేయని రాజకీయ పార్టీలకు, నాయకులకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమితి మేడ్చల్ జిల్లా ఇన్ ఛార్జి అశోక్ కుమార్ తాటికొండ, 124వ డివిజన్ పాస్టర్స్ ఫెల్లోషిప్ ప్రెసిడెంట్ యేసురాజు, సమితి ఆర్గనైజింగ్ సెక్రెటరీ రొనాల్డ్ పాల్గొన్నారు.