Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య కార్యచరణపై గంటకు పైగా చర్చ
హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. శనివారం సాయత్రం హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కల్యాణ్..సుమారు గంటకు పైగా చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇరువురు నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై వారు చర్చించినట్లు తెలిసింది. వైసిపి అప్రజాస్వామ్యక విధానాలను అవలంభిస్తోందనీ, విపక్ష నాయకులను టార్గెట్ చేసి దాడులు చేసేందుకు కూడా వెనకాడటంలేదని చంద్రబాబు ప్రస్తావించిట్లు సమాచారం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఇరు పార్టీలు కలిసి ఐక్యంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రధానంగా చర్చించినట్టు టిడిపి వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏక్య పోరాటాలు నిర్వహించి, ఎన్నికల వేళ పొత్తులపై నిర్ణయం తీసుకుందామని ఇరువురు నేతలు అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.