Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్: విద్వేష పూరిత ప్రసంగాలు చేసి సెక్యుల రిజాన్ని దెబ్బతీస్తే తీవ్ర నేరంగా పరిగణించి అలాంటి వ్యక్తులపై కుల, వర్గం, మతంతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవా లన్న సుప్రీంకోర్టు తీర్పు చారిత్రా త్మకమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఆ తీర్పు ను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో సెక్యులరిజాన్ని కాపా డేందుకు సుప్రీంకోర్టు తాజా తీర్పు దోహదపడుతుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కోర్టులు తీసుకున్నాయనీ, రాజ్యాంగాన్ని అనుసరించాల్సి న బాధ్యత రాజకీయ పార్టీలపై కూడా ఉంటుం దన్న విషయాన్ని మరువకూడదని సూచించారు. లౌకిక త్వంతో పాటు భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమనీ, ఇటీవల కాలంలో దేశంలో అశాంతిని పురి గొల్పేలా కొంత మంది వ్యక్తులు మాట్లాడుతున్నారని విమర్శించారు. విద్వేష పూరిత ప్రసంగాలపై ఫిర్యాదుతో సంబంధం లేకుండా సుమోటోగా తీసుకుని కేసులు నమోదు చేయా లన్న సుప్రీంకోర్టు తీర్పు అభినందనీయమని పేర్కొన్నారు.