Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ పంచాయతీ కార్యదర్శుల దీక్షలు
నవతెలంగాణ- విలేకరులు
జూనియర్ పంచా యతీల కార్యదర్శుల సమ్మె కొనసాగుతోంది. తమను వెంటనే రెగ్యులరైజ్ చేయా లని డిమాండ్ చేశారు. శని వారం పలు జిల్లాల్లో ఎంపీ డీఓ కార్యాలయాల ఎదుట వారి దీక్షలకు ప్రజాసంఘాల నేతలు పలువురు సంఘీభావం తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి పంచాయతీ కార్యదర్శులు వినతిపత్రం అందజేశారు. వీరి దీక్షలకు సీఐటీయూ రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్, కేవీపీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి పరుశురాములు, బి.ఆంజనేయులు, తదితరులు మద్దతు ప్రకటించారు. ఆమనగల్లో చేపట్టిన దీక్షలకు టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి, కాంగ్రెస్ నాయుకులు మద్దతు తెలిపారు. ఖమ్మం జిల్లాలో ముదిగొండలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల దీక్ష శిబిరాన్ని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. సమస్యలు పరిష్కరించే వరకూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.