Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు పడే అవకాశం
- పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల (గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగం)తో వడగండ్ల వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేశారు. ఆ జాబితాలో ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణ్‌పేట, వనపర్తి జిల్లాలున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో రాబోయే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశముంది. శనివారం రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 150కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. శనివారం నాడు ఆదిలాబాద్ జిల్లా జైనధ్‌లో అత్యధికంగా 42.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.