Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం తరపున ఐదు లక్షల ఆర్థిక సాయం
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట్ కలాసిగుడ నాలాలో పడి మరణించిన చిన్నారి కుటుంబాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి శనివారం గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుం టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్ పేట్ కార్పొరేటర్ అరుణ గౌడ్, సికింద్రాబాద్ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి, ఆర్ డి ఓ మరియు బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.