Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ధాన్యాన్ని వెంటనే కొను గోలు చేసి రైతులను ఆదుకోవా లని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం మార్కెట్ యార్డ్లో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మండలంలో పలు ఐకేపీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు కాక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని, ఐకేపీ సెంటర్లలో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల నుంచి కేంద్రంలో ధాన్యం వద్ద కాపలా కాస్తున్నారని, వాతావరణంలో మార్పుల వల్ల ఎప్పుడు వర్షం వస్తుందోనని ఆందోలన చెందుతున్నారని చెప్పారు. నియోజకవర్గంలో ఎంత పంట వేశారు? ఎంత పంట ఐకేపీ కేంద్రాలకు వస్తుందని ముందస్తు ప్రణాళిక ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి లేక పోవడం సిగ్గుచేటన్నారు. కొన్ని ఐకేపీ సెంటర్లలో ధాన్యం లోడ్ ఎత్తాలంటే రైతుల నుంచి అదనంగా డబ్బులు అడుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయ న్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలన్నారు. ఐకేపీ కేంద్రాలకు వచ్చిన ధాన్యంపై కప్పడానికి టార్ఫాలిన్ కవర్లు కూడా ఇవ్వలేని దుస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా యుద్ధ ప్రతిపాదికన ధాన్యాన్ని ఖరీదు చేయకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడ్తామని హెచ్చరించారు. ఈ పర్యటనలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవినాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పిల్లుట్ల సైదులు ఉన్నారు.