Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జేఈఈ మెయిన్-2023 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థ సంచలన రికార్డు సృష్టించింది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ మాట్లాడుతూ ఓపెన్ కేటగిరీలో 300కు 300 మార్కులతో ఆలిండియా ప్రథమ ర్యాంక్‌ను తమ విద్యార్థి వెంకట కౌండిన్య పొందారని చెప్పారు. కె సాయినాథ్ శ్రీమంత్ టాప్ 10 ర్యాంక్‌లో నిలిచారని వివరించారు. అఖిల భారత స్థాయిలో టాప్ టెప్‌లో రెండు, టాప్ 100లో 23 ర్యాంక్‌లు తమ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు పొందారని అన్నారు. అన్ని కేటగిరీల్లో కలిపి టాప్ వందలో 91 మంది ర్యాంకులు సాధించారని చెప్పారు. ఓపెన్ కేటగిరీలో టాప్ వెయ్యిలోపు 146 ర్యాంక్‌లు సాధించామన్నారు. టాప్ వంద ర్యాంకులు పొందిన వారిలో శ్రీచైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు 18 మంది ఉన్నారని వివరించారు. వంద పర్సెంటైల్ పొందిన వారిలో 15 మంది విద్యార్థులున్నారని చెప్పారు. నిరంతరం శ్రమించే తమ అధ్యాపక బృందం వల్లే ఇది సాధ్యమయ్యిందన్నారు. మెరుగైన ఫలితాలు సాధిస్తున్నందునే దేశ వ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాల కోసం విద్యార్థులు శ్రీచైతన్యను ఎంచుకుంటున్నారని అన్నారు. ఘనవిజయం సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందిని శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బిఎస్ రావు అభినందించారు.
నారాయణ విద్యార్థుల విజయదుందుభి
జేఈఈ మెయిన్ ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థ రికార్డు ర్యాంకులను సొంతం చేసుకుంది. ఈ మేరకు నారాయణ గ్రూప్ డైరెక్టర్లు పి సింధూర నారాయణ, శరణి నారాయణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓపెన్ కేటగిరీలో అఖిల భారత స్థాయిలో రెండు, ఐదు, ఆరు ర్యాంకులను తమ విద్యార్థులు సాధించారని తెలిపారు. టాప్ 100లో తమ విద్యార్థులు 25 ర్యాంకులను కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. లోహిత్ ఆదిత్య సాయి రెండో ర్యాంకు, కౌషల్ విజయ్ వార్గేయ ఐదో ర్యాంకు, సాయి దుర్గారెడ్డి ఆరో ర్యాంక్‌లను పొందారని వెల్లడించారు.