Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్స్
- రజక సంఘం రాష్ట్ర మహాసభలో మంత్రి ఎర్రబెల్లి
- జనగామలో రజకుల భారీ ప్రదర్శన
నవతెలంగాణ-జనగామ
రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర మూడో మహాసభ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య అధ్యక్షతన జరిగిన ''రజకుల రక్షణ'' సభలో మంత్రి మాట్లాడారు. జనగామ జిల్లాలో దోబీఘాట్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.2 వందల కోట్ల 70 లక్షలు కేటాయించారన్నారు. అందుకు భూమిని సేకరించాల్సి ఉందని చెప్పారు. అలాగే, పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో కోటి రూపాయలతో ఎకరం స్థలంలో చాకలి ఐలమ్మ పేరిట ఫంక్షన్ హాల్ నిర్మిస్తామన్నారు. ఇండ్లులేని రజకులందరికీ డబుల్ బెడ్ రూమ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రజకుల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. రజకుల సమస్యలపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
ఐలమ్మ స్ఫూర్తితో హక్కుల సాధన.. : ఎమ్మెల్సీ అలుగుబెల్లి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో హక్కులను సాధించుకుందామని ఎమ్మెల్సీ అలుగుబల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. రజకుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆనాటి దొరల, పెత్తందారీ, పెట్టుబడి దారీ విధానాలు అమలు చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. అందుకోసం బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. దేశాన్ని అదానీ అంబానీలాంటి పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు యత్నిస్తుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. రజక సంఘం మహాసభలో ప్రవేశపెట్టిన సమస్యలతో కూడిన తీర్మానాలు సరియైనవేనన్నారు. వీటిని ప్రభుత్వం పైళ్ల ఆశయ్య అధ్యక్షతన జరిగిన ''రజకుల రక్షణ'' సభలో మంత్రి మాట్లాడారు. జనగామ జిల్లాలో దోబీఘాట్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.2 వందల కోట్ల 70 లక్షలు కేటాయించారన్నారు. అందుకు భూమిని సేకరించాల్సి ఉందని చెప్పారు. అలాగే, పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో కోటి రూపాయలతో ఎకరం స్థలంలో చాకలి ఐలమ్మ పేరిట ఫంక్షన్ హాల్ నిర్మిస్తామన్నారు. ఇండ్లులేని రజకులందరికీ డబుల్ బెడ్ రూమ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.రజకుల సమస్యలపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
ఐలమ్మ స్ఫూర్తితో హక్కుల సాధన.. : ఎమ్మెల్సీ అలుగుబెల్లి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో హక్కులను సాధించుకుందామని ఎమ్మెల్సీ అలుగుబల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. రజకుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆనాటి దొరల, పెత్తం దారీ,పెట్టుబడి దారీ విధానాలు అమలు చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. అందుకోసం బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంద న్నారు.ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. రజక సంఘం మహాసభలో ప్రవేశపెట్టిన సమస్యలతో కూడిన తీర్మానాలు సరియైనవేనన్నారు. వీటిని ప్రభుత్వం పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు.
జనగామలో మహాప్రదర్శన
సభకు ముందు జనగామలో స్థానిక క్రిస్టియన్ గ్రౌండ్ నుంచి వైష్ణవి గార్డెన్ వరకు రజకులు పెద్దఎత్తున ప్రదర్శనగా వచ్చారు. ఈ ర్యాలీ డప్పుల నృత్యాలు, ఆటపాటలతో ముందుకు సాగారు. ఈ మహాసభలో స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సారయ్య, జనగామ జడ్పీ చైర్మెన్ పాకాల సంపత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మోకు కనుక రెడ్డి, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేష్, నాయకులు వెంకటేశ్వర్లు, అంజయ్య, ప్రజా సంఘాల నాయకులు రాపర్తి రాజు, విజరు, ధర్మబిక్షం తదితరులు పాల్గొన్నారు.