Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ కమిటినీ ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. ఆదివారం జరిగిన జనరల్ బాడీలో కమిటీకి ఎన్నికలు నిర్వహిం చారు. 82ఏండ్లల్లో హైదరాబాద్ సొసైటీ ఎన్నికలలో మూడుసార్లు మాత్రమే ఏకగ్రీవంగా కార్యవర్గం ఎన్నికైంది.
సొసైటీని 1941లో స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించడం ఇది మూడోసారి. అధ్యక్షులుగా ఎంవీ రమణారెడ్డి, ఉపాధ్యక్షులుగా అనంతయ్య, సురభి అజిత, సంయుక్త కార్యదర్శులుగా కాంతారెడ్డి, గుర్రం మల్లేష్, కోశాధికారిగా నాగుల రాజేందర్ ఎన్నికయ్యారు. తమపై నమ్మకం, విశ్వాసం ఉంచినందు కు సభ్యులందరికీ అనంతయ్య ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.