Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెేజీబీవీ ఉద్యోగులకు వేసవి సెలవులివ్వాలి: టీఎస్‌యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పన్నెండు నెలలు వేతనం ఇస్తున్నాం కాబట్టి వేసవి సెలవుల్లో కూడా రోజూ బడికి రావాల్సిందేనంటూ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల ఉపాధ్యాయు లు, ఉద్యోగులకు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హుకుం జారీచేయడం సబబు కాదని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిరోజూ పాఠశాలలో బయో మెట్రిక్ అటెండెన్స్ వేయాలనీ, సగం మంది బడిలో ఉండాలనీ, మిగిలిన సగం మంది ఊళ్లలో తిరిగి బాలికలను పాఠశాలలో చేర్పించటానికి క్యాంపైన్ చేయాలం టూ ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేసవి మండిపోతు ంటే నెలా పదిహేను రోజులు గ్రామాల్లో తిరగటం ఏంటనీ, పిల్లలు లేకుండా ప్రతిరోజూ బడికొచ్చి ఏం చేయాలని అడుగుతున్న ఉద్యోగులు ఆవేదనను పరిగ ణలోకి తీసుకోవాలని వారు కోరారు. విద్యాశాఖ వెకేషన్ డిపార్ట్మెంట్ అనీ, ఆ డిపా ర్ట్మెంట్ లోని కాంట్రాక్టు ఉద్యోగుకు కూడా వేసవి సెలవులు వర్తిస్తాయని గుర్తు చేశారు. కానీ మానవత్వం లేకుండా కేజీబీవీ ఉద్యోగులను వేసవి సెలవుల్లో కూడా పాఠశాలకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించటాన్ని ఖండిస్తు న్నామని పేర్కొన్నారు. కనీస వేతనాలు ఇవ్వకున్నా రెసిడెన్షియల్ పద్దతిలో పాఠశా లలు నిర్వహిస్తూ నైట్ డ్యూటీలు, ఆదివారం, పండుగ రోజుల్లో సైతం విధులు నిర్వహిస్తూ మానసికంగా ఒత్తిడికి గురౌతున్న ఉపాధ్యాయులకు వేసవి సెలవులు కూడా వర్తింపజేయకపోవటం శోచనీయమని తెలపారు.అన్ని పాఠశాలలకు ఇచ్చినట్టుగానే కెేజీబీవీ ఉద్యోగులకు కూడా వేసవి సెలవులు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు వేసవి సెలవులివ్వాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై అశోక్ కుమార్, ఎం రవీందర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.