Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంపై పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. చారిత్రాత్మక నూతన సచివాలయాన్ని రికార్డ్ సమయంలో అద్భుతంగా నిర్మించి తన చేతులమీదుగా ప్రారంభించడమే కాకుండా, రాష్ట్రంలో వివిధ శాఖల్లో దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పక్షాన చైర్మెన్ మామిళ్ల రాజేందర్ సెక్రటరీ జనరల్ వి.మమత అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్గం జగదీష్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణలతో పాటు టీఎన్జీవో, టీజీవో నేతలు తదితరులు పాల్గొన్నారు.
దేశానికే ఆదర్శం : గాదె వెంకన్న
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ దేశానికే ఆదర్శమని ఆర్జేడి కాంట్రాక్టు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. క్రమబద్ధీకరణ ఉత్తర్వుల కోసం కషి చేసిన మంత్రులు, అధికారులందరికీ పేరుపేరునా కతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయం వద్ద సీిఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
స్వాగతిస్తున్నాం : యూనివర్సిటీ కాంట్రాక్టు టీచర్స్ జేఏసీ
కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణకు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీగా స్వాగతిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపింది. 11 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న 1,335 మంది యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ చైర్మెన్ డాక్టర్ ఎం.రామేశ్వరరావు, కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ కుమార్లోధ్ ఒక ప్రకటనలో కోరారు. 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యూలర్‌ను జారీ చేసిందని, దానికనుగుణంగా యూనివర్సిటీలో పనిచేస్తున్న 1,335 మందిని రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్‌కు ధన్యవాదాలు :మాచర్ల రామకృష్ణగౌడ్
రాష్ట్రంలో 23 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్ల శ్రమను, వెట్టి చాకిరిని గుర్తించి ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించిన సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ మాచర్ల రామకష్ణగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అందుకు సహకరించిన మంత్రులు, విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్ విద్య, కాలేజియేట్, టెక్నికల్ కమిషనర్, ఆర్థికశాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహకరించిన అధికారులందరికి హదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాలు ప్రభుత్వానికి రుణపడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
మిగిలినవారినీ క్రమబద్దీకరించాలి
యూనైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్
పోరాటాల ఫలితంగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించారని, మిగత ఉద్యోగులందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ కోరింది. రాష్ట్రంలో పనిచేస్తున్న 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడంపై రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఫసియోద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదనాయక్ మాట్లాడుతూ వైద్యారోగ్యశాఖలో 2001 నుండి పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొంతమందినే రెగ్యులర్ చేయడం అన్యాయమని తెలిపారు. 22ఏండ్లుగా యూనియన్ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళన పోరాటాలు, నిరవధిక సమ్మెలు నిర్వహించామని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా రెగ్యులర్ కాని ఉద్యోగులు నిరాశ, నిస్పహలకు లోను కాకుండా క్రమబద్ధీకరణ జరిగే వరకు పోరాటాలలో ఐక్యంగా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఉపాధ్యాయులకు ట్యాబ్‌ల పంపిణీపై
పీఆర్టీయూటీఎస్ హర్షం
రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అన్ని విభాగాలు ఒకే చోట ఉండేటట్టుగా సమీకత సచివాలయం నిర్మాణం చేపట్టి దానికి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బీఆర్. అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు, శాసన మండలి సభ్యులు కూర రఘోత్తంరెడ్డి, మాజీ శాసన మండలి సభ్యులు పూలరవీందర్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాబోయే విద్యా సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయులకు ట్యాబ్‌ల పంపిణీకి సంబంధించిన ఉత్తర్వులు విడుదల కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో ఏర్పడిన న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి విద్యార్థులకు విషయ నిపుణుల కొరత తీర్చి, నాణ్యమైన విద్యను అందించే విధంగా కషి చేయాలని కోరారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణను స్వాగతిస్తున్నాం
క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అసోసియేషన్
ప్రభుత్వం కేవలం 5,544 మందిని మాత్రమే పరిగణలోకి తీసుకుని మిగతా వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందనిక్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుండిగల్ యాదగిరి అన్నారు.
సర్కార్ నిర్ణయాన్ని ఖండించారు. 'తెలంగాణ సమగ్ర శిక్షా'లో దశాబ్ద కాలంగా విధులు నిర్వహిస్తున్న 21వేల మంది ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన మాటపై నిలబడాలని ప్రభుత్వాన్ని కోరారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చర్స్ అసోసియేషన్
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు /లెక్చరర్ల వెట్టి చాకిరి విముక్తిపై నూతన సచివాలయంలో తొలి సంతకం చేసిన సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు జి.రమణారెడ్డి, డాక్టర్ కుప్పిశెట్టి సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగుల విముక్తికి దిక్సూచిలాగా ఉంటుందని అన్నారు.22ఏండ్లుగా క్రమబద్ధీకరణ కోసం ఉద్యమాలు చేశామని గుర్తుచేశారు.