Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హనుమకొండ
హనుమకొండ జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఓ వివాహితను ఇద్దరు యువకులు ఆటోలో కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. హనుమకొండ పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలోని రాంనగర్‌కు చెందిన ఓ వివాహిత(40) కిషన్‌పురలోని ఓ కర్రీ పాయింట్లో కుకింగ్ మాస్టర్‌గా పనిచేస్తున్నది. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా శుక్రవారం రాత్రి భర్తతో గొడవపడి రాత్రి సుమారు 12 గంటల సమయంలో తాను పనిచేస్తున్న కర్రీ పాయింట్ వద్దకు వచ్చి పడుకోవాలనుకుంది.